ఇండియన్ మోస్ట్ వెయిటెడ్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ భామ ఆలియా భట్ నటించింది. అయితే, ఈ సినిమా గురించి గతకొన్నిరోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నిజానికి అలియా భట్ పాత్ర చాలా పెద్దగా ఉంటుందని అనుకున్నారు. కానీ, సినిమా చూసిన తర్వాత మరో హీరోయిన్‌గా నటించిన ఒలీవియా మోరిస్ పాత్ర కంటే అలియా భట్ పాత్ర చాలా చిన్నగా కనిపించింది. దీంతో ఆమె రాజమౌళి మీద కోపంగా ఉందని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే ఆలియా భట్ తన సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ పోస్టులను డిలీట్ చేసిందని ప్రచారం జోరుగా సాగింది. ఇక ఈ వార్తలపై ఆలియా భట్ ఈ విషయం మీద ఎట్టకేలకు స్పందించింది. ఈ పుకార్లకు చెక్ పెట్టింది. తాను ఆర్ఆర్ఆర్ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.
“ఆర్ఆర్ఆర్ టీమ్ వలన నేను అప్సెట్ అయ్యానని, అందుకే ఆర్ఆర్ఆర్ పోస్ట్లు డిలీట్ చేశానని ఈరోజు ఎవరో నాతో అన్నారు. దయచేసి ఇది నా మనవి.. ఇంస్టాలో జరిగే వాటిని బట్టి ఎలాంటి ఊహాగానాలు పెట్టుకోకండి. ఎప్పటికప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో నేను చాలావాటిని డిలీట్ చేస్తూ ఉంటాను.. ఎందుకంటే నాకు చిందరవందరగా ఉంటె నచ్చదు.. అందుకే తక్కువ పోస్ట్లు ఉండేలా చూసుకుంటాను. నేను ఆర్ఆర్ఆర్ ప్రపంచంలో భాగమైనందుకు ఎంతగానో గర్విస్తున్నాను. సీత పాత్ర నేను ప్రేమించి చేశాను.. రాజమౌళి సర్ తో వర్క్ చేయడం నేను చాలా ఇష్టపడ్డాను. ఇక చరణ్, తారక్ తో కలిసి పనిచేయడం నాకెంతో ఇష్టం. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ప్రతిదీ నేనెంతో ఇష్టపడి చేశాను. ఈ విషయం నేను చెప్పడానికి కారణం కేవలం రాజమౌళి సర్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు.. ఎన్నో ఏళ్లు ఈ సినిమా కోసం పనిచేశారు. అలాంటిది వలన ఈ సినిమా గురించి తప్పుగా మాట్లాడుకోవడం, మిస్ యూజ్ చేయడం లాంటివి జరగకూడదని చెప్తున్నాను” అంటూ ఆలియా భట్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్లే అని తెలుస్తోంది.