లెజెండరీ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ 1970-80 లలో బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరుతెచ్చుకున్నాడు. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ విజయశాంతి మహిళలను ఉద్దేశించి తీసిన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాల్లో ఆమె చేసిన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ చూసి జనాలు ఆమెను లేడీ అమితాబ్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ బిరుదును ఓ యువ నటి లాక్కుంది.
ఆమె మరెవరో కాదు అలియా భట్. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన హీరోయిన్లలో అలియా ఒకరనటంలో సందేహం లేదు.
ప్రస్తుతం అలియా నటించిన గంగూబాయి కతియావాడి విడుదలకు రెడీ గా ఉంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
కాగా తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో అలియా మాట్లాడుతూ, గంగూబాయి తన కెరీర్‌లో ఇప్పటివరకు పోషించిన అత్యంత కఠినమైన పాత్రలలో ఒకటని అన్నారు. కమర్షియల్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది.
ఇక ఇప్పుడు ప్రేక్షకులు తనను “4 అడుగుల అమితాబ్”, “లేడీ అమితాబ్” అని పిలుస్తున్నారని ఇది నిజంగా ఏ భారతీయ నటి అయినా అందుకోగలిగే గొప్ప అభినందన అంటూ చెప్పుకొచ్చారు.