రణబీర్ కపూర్ , అలియా భట్ పెళ్లి కోసం అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరి పెళ్ళికి సంబంధించిన పుకార్లు రెండేళ్లుగా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఏడాది వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని టాక్ నడుస్తుంది.
2020 ప్రారంభంలో కరోనా రాకపోయి ఉంటే అలియాను వివాహం చేసుకుని ఉండేవాడని గతంలో రణబీర్ కపూర్ చెప్పాడు. కాగా ఇప్పుడు ఆలియా ఓ ఇంటర్వ్యూ లో పెళ్లి పై స్పందించింది. తన బాయ్‌ఫ్రెండ్ అలా అనడంలో తప్పు లేదని చెప్పుకొచ్చింది.
తమ పెళ్లి ఎప్పుడు జరిగినా అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపింది. నా నుదిటిపై రణబీర్ కపూర్‌తో పెళ్లి రాసి ఉందని…. నేను కూడా చాలా కాలంగా వివాహం చేసుకున్నట్టే ఉంటున్నానని తెలిపింది.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఇద్దరూ నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న విడుదల కానుంది. అలాగే అలియా నటించిన గంగూబాయి కతియావాడి ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది. అలాగే ఆర్ ఆర్ ఆర్ మార్చి 25న రిలీజ్ కాబోతుంది.