“భీమ్లా నాయక్” విడుదలతో తెలుగు సినీ అభిమానులు పవన్ కళ్యాణ్ పేరునే జపం చేస్తున్నారు. దీనితో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ “గంగూబాయి కతియావాడి” చిత్రం ఎలా ఉందో అనేది మరచిపోయారు. తెలుగులో అంతగా ఎక్కడ వినిపించకపోయినప్పటికీ హిందీ లో మాత్రం మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.
అయితే ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాగా ఫస్ట్ డే ₹10 కోట్ల+ నెట్ మాత్రమే వసూలు చేసిందట గంగూబాయి కతియావాడి. ఇది భీమ్లా నాయక్ నైజాం థియేటర్ల నుండి వసూలు చేసిన దాని కంటే తక్కువ.
అయినప్పటికీ సినిమా మొత్తంలో అలియా భట్ సో లో నటన చూసిన వాళ్లందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒక సాధారణ అమ్మాయి వేశ్యకు రక్షకురాలిగా, నాయకురాలిగా మారిన పాత్రలో అలియా ప్రవర్తించిన విధానం పూర్తిగా అద్భుతమైనదనే చెప్పాలి.
ఇక బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం….ఈ చిత్రం మొదటి వారాంతంలో దాదాపు ₹35-45 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ₹100 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం కూడా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.