విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గంగూబాయి మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. మరోవైపు వీడియో సాంగ్స్ ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ఇక సోమవారం “మేరీ జాన్” అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పాటలో నటుడు శంతను మహేశ్వరితో కారులో అలియా భట్ చేసిన రొమాన్స్, కోపం చాలా అద్భుతంగా చూపించారు. 2-3 కట్‌లు మినహా, ఈ పాట వన్-టేక్ విజువల్‌గా ఉన్నట్లు కనిపిస్తుంది.
సెకెన్ల వ్యవధిలోనే అలియాభట్ ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, సాంగ్స్ ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకోటమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచాయి.
మరి ఈ సినిమా కలెక్షన్లు పరంగా ఏ మేరకు హిట్ సాదిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 25 వరకు ఆగాల్సిందే.
Advertisements