ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ నుండి విరామం తీసుకున్న అలియా భట్ ప్రస్తుతం గంగూభాయ్ కతియావాడిని ప్రమోట్ చేస్తోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తెలుగు హీరోల గురించి, సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొన్ననే అమెజాన్ ప్రైమ్‌లో పుష్పను చూశానని అప్పటి నుంచి రెండవ ఆలోచన లేకుండా అల్లు అర్జున్‌కి వీరాభిమాని అయ్యానని చెప్పుకొచ్చింది.
నా కుటుంబం అంతా పుష్పను చూసి అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ అయ్యారు. ఆయనతో జోడీ కట్టే అవకాశం ఎప్పుడు దొరుకుతుంది అని నన్ను అడుగుతారు.
ఇంట్లో నన్ను ఆలు అని పిలుస్తుండగా, ఆలు, మీరు అల్లుతో ఎప్పుడు పని చేస్తారు? అంటూ అన్నారని తెలిపింది. అతనితో కలిసి పనిచేసే అవకాశం వస్తే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతానని చెప్పుకోచింది. మరి చూడాలి ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో.
ఇకపోతే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా అలియాభట్ నటించబోతుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా చెప్పారు.