ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కలల ప్రాజెక్టు అయిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలు రాజకీయ, క్రీడారంగ, బాలీవుడ్,కోలీవుడ్ తారలు, ఇతర పారిశ్రామికవేత్తలు తరలివచ్చి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలైన అమీర్ ఖాన్ , సల్మాన్ ఖాన్ , ఐశ్వర్యరాయ్, అనుపమ్ ఖేర్, విద్యాబాలన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే , ప్రియాంక చోప్రా-నిక్‌జోనస్, వరుణ్ ధావన్, సోనమ్ కపూర్, జావేద్ అక్తర్, షబానా అజ్మీ, సునీల్ శెట్టి, షాహిద్ కపూర్, అలియా భట్‌ది, దియా మీర్జా, శ్రద్ధా కపూర్, రాజు హిరానీ, తుషార్ కపూర్ వంటి వారెందరో కలర్ ఫుల్ డ్రస్సులో కనిపించి ఆకర్షించారు.
వీరిలో ప్రత్యేకంగా కొందరు నటీమణులు గురించి చెప్పుకోవాలి. వారు ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని చెప్పుకొవడంలో అతిశయోక్తి లేదు.
ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్ వారి కుమార్తె మాల్తీ మేరితో కలిసి సందడి చేసింది. ప్రియాంక ధరించిన మెరిసే డ్రెస్ చాలా అందంగా కనిపించింది. దానికి అందమైన షీర్ కేప్ కూడా ఉంది.
మరో ముద్దుగుమ్మ దీపికా పదుకొణె తన ప్యాంట్ సూట్ లో కేప్ తో బాస్ లేడీ వైబ్స్ ఇచ్చింది. ఆమె ప్యాంట్‌సూట్ లేత గోధుమరంగు రంగులో ఉంది. ఆమె వేషధారణ యూఎస్పీ ఒక షీర్ కేప్ ఆమెను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. బాలీవుడ్ బెబో ఎరుపు రంగు దుస్తులు ధరించి వీక్షకుల హృదయాలను దోచుకుంది. మెరిసే లెహంగా తో అందరి చూపును ఆమె వైపునకు తిప్పుకుంది. కొత్త పెళ్లి కూతురు కియారా అద్వానీ లేత గోధుమ రంగులో అద్భుతంగా కనిపించింది. అందంగా కత్తిరించిన బ్యాక్‌లెస్ బ్లౌజ్‌ని ధరించింది, దానిపై ముత్యాలు ఉన్నాయి. ఆమె దానిని ఫిష్-కట్ లెహంగాతో జత చేయడంతో మెరిసిపోయింది.
బాలీవుడ్ సొట్టబుగ్గల సుందరి అలియాని చూస్తే ఎవరూ కూడా ఆమె ఒక బిడ్డకు తల్లి అంటే నమ్మరు. ఆమె శుక్రవారం రాత్రి చీర కట్టులో మెరిసింది. గ్రే ట్యూబ్ బ్లౌజ్‌తో జతగా ఉన్న ఆమె వెండి ముడతలుగల చీర ఆమెకి పర్ఫెక్ట్గా కనిపించింది.