- పోలీసుల అదుపులో పలువురు ఆందోళనకారులు
- రైల్వే సర్వీసులు పున:ప్రారంభం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిస్థితి పూర్తిగా సద్దుమణిగింది. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు చేపట్టిన హింసాత్మక ఘటనల నుంచి పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ మెట్రో సేవలను అధికారులు పున: ప్రారంభించారు.
హైదరాబాద్ లో ఆందోళనకారులు చేపట్టిన రైల్వేస్టేషన్ లో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రావడంతో రైల్వే సేవలను పునరుద్ధరించారు. మరోవైపు హింసాత్మక చర్యలకు పాల్పడిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోవడంతో.. సుదీర్ఘ ఉద్రిక్తతల అనంతరం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దీంతో అధికారులు షెడ్యూల్ రైళ్లను పునః ప్రారంభించారు.
మరోవైపు ఆందోళనలతో సంబంధం ఉన్న పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. ఇందులో ఆందోళన విరమించేందుకు ససేమిరా అంటున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి ఏఆర్ఓ కార్యాలయానికి తరలించారు. అంతేకాకుండా సిటీలో సైతం పరిస్థితి కంట్రోల్‌కి రావడంతో హైదరాబాద్ మెట్రో సేవలను అధికారులు పునరుద్ధరించారు.