కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో… దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వినోద రంగం కూడా ఇంటికే పరిమితమైంది. షూటింగ్ లకు ప్యాకప్ చెప్పి నటీ నటులంతా ఇంట్లోనే ఉంటున్నారు. కానీ సినిమా రంగంలో పనిచేసే దినసరి కూలీలు, ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు తోడుగా ఉండాలన్న సంకల్పం, తమను ఎంతగానో అభిమానించే దేశ ప్రజల భద్రత కోసం భాషలకు అతీతంగా స్టార్స్ అంతా ఏకం అయి… ఓ కుటుంబంగా తీసిన షార్ట్ ఫిల్మ్- ఫ్యామిలీ
కుటుంబ పెద్దగా అమితాబ్ నటించగా… సూపర్ స్టార్స్ రజినీకాంత్, చిరంజీవి, రణబీర్ కపూర్, అలియా భట్, ప్రియాంక చోప్రా, మోహన్ లాల్, మమ్మూట్టి, సోనాలి కులకర్ణి, ప్రొసెంజిత్ చటర్జీ, శివ రాజ్ కుమార్, దిల్సిత్ దోషాంద్ నటించారు.
ప్రసున్ పాండే దర్శకత్వంలో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ అంతా అమితాబ్ సన్ గ్లాసెస్ చుట్టూ తిరుగుతాయి. ఎక్కడ ఉందో చూడండి అంటూ అమితాబ్ మొదలుపెట్టగా… సూపర్ స్టార్స్ అంతా తమ, తమ సొంత భాషల్లో మాట్లాడుతూ అలరిస్తారు. చివరకు సన్ గ్లాసెస్ దొరికినా… బయటకు వెళ్లటానికి లేదు, వాటి అవసరం లేదు కదా అనే మెసెజ్ తో ముగుస్తుంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా మహమ్మారీ నుండి బయటపడాలని బిగ్ బీ సందేశం ఇస్తారు.
సోనీ ఎంటర్టైన్మెంట్స్, కళ్యాణ్ జ్యూవెలర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని సినిమా రంగంలో పనిచేస్తూ, ఆకలితో అలమటిస్తున్న వారి కడుపునింపేందుకు ఉపయోగించనున్నారు.