హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారసమయం శనివారం సాయంత్రం ముగియటం తో అన్ని పార్టీలు డబ్బులు పంచే పనిలో పడ్డాయి. నిన్నటి వరకు నోటితో ప్రచారం చేసిన నాయకులు.. ఇక నోట్లతో ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఇక అధికార తెరాస పార్టీ ఎలాగైనా హుజూర్ నగర్ లో తమ జండా ఎగురవేయాలని చూస్తుంటే…తన గెలుచుకున్న సీట్ మళ్ళీ తన భార్య గెలవాలని పట్టుదలతో ఉన్నాడు ఉత్తమ్. ఆర్టీసీ సమ్మె నేపథ్యం లో ప్రచారానికి రాని కేసీఆర్, కేటీఆర్ లు హుజూర్ నగర్ లో గట్టిగ డబ్బులు పంచటానికి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. దానికి సంబందించి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం అయ్యాయని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే ఓటమి భయం తో కనిపిస్తున్న తెరాస కు ఇది గట్టిసవాల్ కావటంతో ఒక్కో ఓటుకు 5 వేలు కు పైనే ఉండాలని కేసీఆర్ హుజూర్ నగర్ నాయకులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం . మరో వైపు కాంగ్రెస్ కూడా అదే స్టాటజీతో ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ఏర్పాట్లు చేసుకుంటుంది.
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో అటు తెరాస పార్టీ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి, బీజేపీ నుంచి రామారావు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ లో ఉన్న సంగతి తెలిసిందే.