అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న నిరసనకు రాజమహేంద్రవరంలో అఖిలపక్షం మద్దతు తెలిపింది. తాడితోట సెంటర్ లో అరగంట పాటు నిరసన కార్యక్రమం చేపట్టిన అఖిలపక్ష సభ్యులు.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు.
ఈ నెల 17న తిరుపతిలో జరిగే బహిరంగ సభకు పోలీసులు పర్మిషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా.. అసెంబ్లీలో అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ పోరాటం చేస్తామన్నారు. ఢిల్లీ రైతుల స్పూర్తితో అమరావతి రైతులు చేస్తున్న పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. టీడీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ , బీఎస్పీ పార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.