సిద్ధిపేట జిల్లాలో అఖిలపక్ష నేతల అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. జిల్లాలోని చేర్యాల పెద్దచెరువు మత్తడి వద్ద అక్రమ కాలువ నిర్మాణాన్ని నిరసిస్తూ అఖిలపక్ష నేతలు మున్సిపల్ ముట్టడికి పిలుపునిచ్చాయి.
అఖిలపక్షం బంద్ పిలుపు నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మాల్లారెడ్డి, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందే బీరయ్య, కాంగ్రెస్ కౌన్సిలర్ చెవిటి లింగం, ఒగ్గురాజును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి కొమురవెళ్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నిస్తే… చర్యలు తీసుకోవాల్సింది పోయి, తమనే అరెస్ట్ చేయటం ఏంటని నేతలు మండిపడుతున్నారు. వెంటనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కేసులు నమోదు చేయాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరుతున్నారు.