ఈ నెల 30 న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీ జరగబోతుందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడించారు. దేశంలో కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు సహా ఇతర అంశాలపై చర్చ జరగనుంది. ఈ భేటీలో రైతుల ఉద్యమం, రైతు చట్టాలను వెనక్కి తీసుకోవటంపై అఖిలపక్షం ప్రధాని ముందు లేవనెత్తే అవకాశం ఉంది.
అఖిలపక్ష సమావేశానికి గుర్తింపు పొందిన అన్ని ప్రధాన పార్టీలకు ఆహ్వానం అందనుండగా… సభలో వ్యవహరించాల్సిన తీరుపై అదే రోజు ఎన్డీఏ పక్షాల సమావేశం కూడా ఉంది. ఈ భేటీకి అన్నాడీఎంకే కూడా హాజరవుతుందా…? లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతుండగా, ఉత్తరాధి మిత్రపక్షాలు ఏవేవీ కలసివస్తాయో ఆసక్తిరంగా మారింది.