హైదరాబాద్: ఆర్టీసీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కార్మికుల భవిష్యత్ సహా సమ్మెపై ఆర్టీసీ జెఎసీ రేపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల మద్దతు కోరిన ఆర్టీసీ జేయేసీ రేపు తెలంగాణ జనసమితి నేత కోదండరాం అద్యక్షతన అఖిలపక్ష సమావేశం జరపబోతోంది. ఓవైపు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ కార్మికవర్గాలలో, ఇటు ప్రభుత్వంలో కనిపిస్తోంది.