తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రైతులు సభా ప్రాంగణం దగ్గర భూమి పూజ నిర్వహించారు. అమరావతి నినాదాన్ని ఎలుగెత్తి చాటేలా రైతులు ఈ సభను నిర్వహిస్తున్నట్టు ఐక్యకార్యాచరణ సమితి నేతలు తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎంకు చెందిన నేతలను ఈ సభకు ఆహ్వానించినట్లు చెప్పారు. ప్రజా, రైతు, వర్తక, వాణిజ్య సంఘాలను ఆహ్వానించినట్టు తెలిపారు.
ప్రతి ఒక్కరూ సభను చూసేలా ఎల్‌ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు నిర్వాహకులు. ఈ సభకు చంద్రబాబు సహా ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నట్లు సమాచారం.