దేశంలోని అత్యంత చిన్న వయస్సున్న మేయర్ గా తిరువనంతపురం మేయర్ రికార్డు సృష్టించబోతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ సీపీఎం మెజారిటీ స్థానాలు సాధించింది. కేరళ రాజధాని తిరువనంతపురం కార్పోరేషన్ కు కేవలం 21ఏళ్ల లా స్టూడెంట్ మేయర్ కాబోతున్నారు.
లా స్టూడెంట్ గా ఉన్న ఆర్య రాజేంద్రన్ ను మేయర్ గా ఎన్నుకోవాలని స్థానిక పార్టీ నిర్ణయించింది. దీన్నే శనివారం రాష్ట్ర పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. దీంతో దేశంలోనే అత్యంత పిన్న వయస్సులో మేయర్ అయిన తొలి మేయర్ గా ఆమె రికార్డు సృష్టించబోతున్నారు.