సినిమా పరిశ్రమలో సుకుమార్ కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ రేంజ్ పుష్ప సినిమాతో ఇంకా పెరిగింది అనే చెప్పాలి. అగ్ర హీరోలకు మంచి హిట్ లు ఇస్తున్న సుకుమార్ తన శిష్యులను సినిమాల్లోకి తీసుకొచ్చి మంచి దర్శకులను చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన వద్ద సహాయ దర్శకులుగా పని చేసిన వారు అందరూ కూడా దాదాపుగా కెరీర్ లో సెటిల్ అవుతున్నారు అనే చెప్పాలి.
ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారిన బుచ్చి బాబు ఆయన వద్ద సహాయ దర్శకుడిగా పని చేసాడు. ఆ సినిమా మంచి హిట్ కావడమే కాకుండా ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో పని చేసే అవకాశాన్ని కూడా బుచ్చి బాబుకి కల్పించింది. ఇప్పుడు మరో హీరో కోసం కూడా కథ రెడీ చేసుకుని గురువు వద్ద మార్పులు చేస్తున్నాడు. ఇక శ్రీకాంత్ ఓదెల అనే దర్శకుడు కూడా ఇప్పుడు హిట్ కోసం అడుగులు వేస్తున్నాడు.
ఆయన నానీ హీరోగా దసరా అనే సినిమాను లైన్ లో పెట్టాడు. ఆ సినిమా తర్వలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక మరో దర్శకుడు కార్తిక్ వర్మ కూడా లైన్ లోకి వస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా వీరూపాక్ష అనే సినిమా చేస్తున్నాడు. ఇలా సుకుమార్ వద్ద చేసిన వాళ్ళు అందరూ మంచి హిట్ లు కొడుతున్నారు. వచ్చే ఏడాది మరో శిష్యుడు కూడా పరిచయం అయ్యే అవకాశం ఉంది.