అల్లరి నరేష్… ఒకానొక సమయంలో కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో వరుస అపజయాలతో నిరాశ చెందాడు. కానీ తాజాగా వచ్చిన నాంది సినిమా మాత్రం థియేటర్స్ లో ప్రేక్షకులను కట్టిపడేసింది. పక్క సీరియస్ పాత్రను ఎంచుకున్న అల్లరి నరేష్ నటన పరంగా తానేంటో నిరూపించుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో నరేష్ నట విశ్వరూపం చూపించారు అనే చెప్పాలి.
కాగా ఈ సినిమా విజయం పట్ల అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఈ సినిమాతో నన్ను మళ్లీ పొందాను. ఇటువంటి అవకాశం నాకు అందించినందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలనిపిస్తోంది. చేస్తాను కూడా. అంతేకాకుండా నా తర్వాతి సినిమాను కూడా విజయ్ దర్శకత్వంలో చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడంతోనే మళ్ళీ అతని దర్శకత్వంలో మరో సినిమా వస్తే బాగుంటుందని భావించి నరేష్ అతనికి ఓకే చెప్పారని సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈసారి ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి.