గత కొన్ని ఏళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు హీరో అల్లరి నరేష్. మహర్షి సినిమా తో హిట్ అందుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో హీరోగా ప్రభావం చూపించలేకపోయాడు. ఇక ఈ సినిమాలో నటన పరంగా మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం నరేష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో బంగారు బుల్లోడు కూడా ఒకటి.
నందిని నర్సింగ్ హోమ్ దర్శకుడు పివి గిరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పూజా ఝవేరి నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఎప్పుడో పూర్తయినప్పటికీ కరోనా కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది. అయితే ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయిన నేపథ్యంలో ఈ సినిమాను జనవరి 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర యూనిట్ ప్రకటించింది.