థియేటర్లు తెరిచిన తర్వాత కొత్త సినిమాల రిలీజ్ జోష్ సంక్రాంతి నుండి మొదలుకానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ సంక్రాంతి రేసులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే విజయ్ మాస్టర్ మూవీ, రవితేజ క్రాక్, రానా అరణ్య, రామ్ రెడ్ సినిమాలు సంక్రాంతి రేసులో ఉండగా, తాజాగా అల్లరి నరేష్ కూడా జాయిన్ అయిపోయారు.
చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తై, రిలీజ్ ఆగిపోయిన అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మాతగా, గిరి దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్ కన్ఫామ్ అయ్యింది.
అల్లరి నరేష్ మరో సినిమా నాంది కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ సమ్మర్ స్టార్టింగ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.