నందమూరి హీరో బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా రాబోతుంది. వచ్చే నెల నుండి షూటింగ్ మొదలు కానుంది. వీరిద్దరి మధ్య గతంలో వచ్చిన రెండు సినిమాల మంచి హిట్ కొట్టిన నేపథ్యంలో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్టోరీలో వచ్చే కొన్ని సన్నివేశాలకు యంగ్ హీరో కోసం దర్శకుడు చాలా రోజులుగా వేట కొనసాగిస్తున్నారు.
ముందుగా నవీన్ చంద్ర, నవదీప్ పేర్లు అనుకున్నప్పటికీ… అల్లరి నరేష్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతుంది. అయితే, దీనిపై అల్లరి నరేష్ మాత్రం ఇంకా తన డెసిషన్ చెప్పనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు హీరోయిన్ గా నటిస్తారన్నది ఆసక్తిగా మారగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను దసరాకు ప్రకటించే అవకాశం ఉంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2021 సమ్మర్ లో సినిమా విడుదల చేయాలని బాలయ్య-బోయపాటి ఫిక్స్ అయ్యారని సమాచారం.