కామెడీ స్టార్ గా ఉన్న అల్లరి నరేష్… డిఫరెంట్ జానర్ తో వచ్చిన మూవీ నాంది. యాక్షన్ బేస్డ్ సినిమాగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది…? నగ్నంగా నటించేందుకు కూడా సాహసం చేసిన నరేష్ ప్రేక్షకులను మెప్పించారా..?
ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెడితే మనం ఏం చేయలేమా…? ఈ ఒక్క లైన్ చుట్టూ సినిమా మొత్తం సాగుతుంది. ఈ లైన్ చుట్టూ అల్లిన కథే నాంది. సగటు వ్యక్తులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే ఉపయోగపడే ఐపీసీ సెక్షన్ 211ను ఎలివేట్ చేస్తూ సినిమా సాగుతుంది. పౌర హక్కుల నేత హత్య కేసులో హీరోను అరెస్ట్ చేయటం, అండర్ ట్రయల్ ఖైదీగా హీరో జైళ్లో పడ్డ కష్టం, వరలక్ష్మీ శరత్ కుమార్ లయర్ గా ఎంట్రీ ఇవ్వటం, ఎలా భయటకు తీసుకరాగలుగుతారు అన్నదే ఈ సినిమా.
అల్లరి నరేష్ నుండి ప్రేక్షకులు ఊహించని సినిమా ఇది. గతంలో మహార్షిలో నరేష్ క్యారెక్టర్ లాగే ఈ సినిమా ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 211 గురించి తెలుపుతూ సినిమా సాగుతుంది. నరేష్ నటన అద్భుతంగా ఉంటుంది. అయితే, ప్రియదర్శి, ప్రవీణ్ ఉన్నప్పటికీ పెద్దగా కామెడీ ఉండదు. పైగా అలా వచ్చి ఇలా పోతుంది. ఇక పాటలు కూడా సోసో అన్నట్లుగా ఉంటాయి కానీ టైటిల్ సాంగ్ మాత్రం కాస్త ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. కథ ఫోకస్డ్ గా డైరెక్టర్ సినిమాను తెరకెక్కించాడు. మాజీ హోంమంత్రి కేసులో ఇన్వాల్స్ అయిన సమయంలో వచ్చే సీన్స్ లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. ఎంజాయ్ కోసం వెళ్లేవారి కోసం కాకుండా… కొత్త జానర్ చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చే సినిమా అని చెప్పుకోవచ్చు.