అల్లరి నరేష్ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టేస్తున్నాయి. ఇటీవల విడుదలైన బంగారు బుల్లోడు కూడా నిరాశనే మిగిల్చింది. ఈ సమయంలో నాంది సినిమా విడుదలకు ముస్తాబయ్యింది. నిజానికి నాంది సినిమా పోస్టర్ తో సినిమాపై భారీ అంచనాలున్నాయి. నగ్నంగా నరేష్ పోస్టర్ పై కనిపించాడు.
జైల్లో జరిగిన ఓ కథతో ఈ థ్రిల్లర్ కథను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా థియరేటికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను జీ స్టూడియోస్ దక్కించుకుంది. 8.5కోట్లకు ఈ హక్కులు దక్కించుకోగా… థియేటర్లలలో రిలీజ్ చేస్తారా లేక నేరు జీ5లో రిలీజ్ చేస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతుంది.