గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు అల్లరి నరేష్. ఇటీవల బంగారు బుల్లోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ప్రస్తుతం ఈ అల్లరోడు నాంది సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఎప్పుడు కామెడీ సినిమాలు చేసే అల్లరి నరేష్ ఈ సినిమాలో మాత్రం దానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పటికే టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో నరేష్ ఖైదీ గా కనిపించబోతున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చేందుకు చేస్తున్న పోరాట నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.
విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీను ఫిబ్రవరి 19న రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది.