‘అల్లరి’ సినిమాతో సిల్వన్ స్క్రీన్ కి పరిచమయ్యాడు నరేష్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. అప్పటినుంచి ‘అల్లరి నరేష్’ గా పేరు తెచ్చుకున్నాడు. కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అల్లరి నరేష్. అయితే ఈ మధ్య ఆయన వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. కామెడీనే కాదు.. సీరియస్ హీరోగా కూడా చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ‘నాంది’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు నరేష్.
అయితే ప్రస్తుతం అల్లరి నరేష్ యూటర్న్ తీసుకున్నాడు. ఆయన నుంచి కామెడీ మూవీలు వచ్చి చాలా రోజులే అయింది. దీంతో సీరియస్ రోల్స్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్లీ కామెడీ ట్రాక్ ఎక్కాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం ‘ఉగ్రం’ చిత్రం చేస్తోన్న నరేష్.. మళ్లీ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు శ్రీకారం చుట్టారు.
కొత్త చిత్రం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తన 61వ సినిమా ద్వారా.. మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. నరేష్, ఫరియా జంటగా వస్తోన్న మొదటి చిత్రం ఇదే. అల్లరి నరేష్ సినిమా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది.
అల్లరి నరేశ్ ప్రస్తుతం నాంది ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీ సమ్మర్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మలయాళ భామ మిర్నా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.