50కి పైగా సినిమాలు చేశాడు అల్లరినరేష్. సుడిగాడు సినిమా తర్వాత మాత్రమే తన పారితోషికం పెంచాడు. ఈమధ్య నాంది సినిమా సక్సెస్ అయినప్పటికీ, అల్లరోడు తన రేటు పెంచలేదని టాక్. ఎందుకంటే, అతడికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు మార్కెట్ కూడా నిలకడగా లేదు. అందుకే రెమ్యూనరేషన్ విషయంలో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న అల్లరి నరేష్, ఎట్టకేలకు తన పారితోషికాన్ని కాస్త సవరించినట్టు తెలుస్తోంది.
ఈరోజు కొత్త సినిమా లాంఛ్ చేశఆడు అల్లరి నరేష్. ఏఆర్ మోహన్ దర్శకత్వంలో, రాజేష్ దండ నిర్మాతగా అల్లరి నరేష్ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఇది నాంది తరహా ప్రయోగం కాదు, పక్కా కామెడీ సినిమానే. కాస్త సెంటిమెంట్ టచ్ కూడా ఉంటుందట. జీ స్టుడియోస్ ఈ ప్రాజెక్టులోకి ఎంటరైంది. దాదాపు 60శాతం ఫండింగ్ ఇస్తోంది. దీంతో నిర్మాతపై భారం తగ్గింది.
ఇలా అన్నీ అనుకూలించడంతో అల్లరి నరేష్ తన రెమ్యూనరేషన్ ను కాస్త పెంచినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ హీరో ఈ కొత్త సినిమాకు మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం. ఈ హీరో కెరీర్ లోనే ఇది హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అంటున్నారు.
అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ సినిమాకు, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది, ఇందులో హీరోయిన్ గా ఎంపికైంది.