టాలీవుడ్ లో కామెడి హీరోగా ముద్ర పడినా ఇప్పుడు సీరియస్ సినిమాల మీద ఫోకస్ చేసాడు అల్లరి నరేష్. తన సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు. ఇక అల్లరి నరేష్ తన కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చిన్నతనం నుంచి తనకు పెద్దగా టాలెంట్ లేకపోయినా తనకు మాత్రం సినిమాలంటే మహా ప్రాణం అని చెప్పుకొచ్చాడు.
హీరో అవ్వాలని మాత్రం ఏనాడు కలలు కనలేదని, తండ్రి మాదిరిగా డైరెక్టర్ అవ్వాలని కూడా అనుకోలేదని చెప్పుకొచ్చాడు. కాని విలన్ అవ్వాలని మాత్రం ఫిక్స్ అయ్యాడట. తాను హీరో మెటీరియల్ కాదని, బక్కగా ఉంటానని తన ఫేస్ కట్ కూడా హీరో ఫేస్ కట్ కాదని బలంగా నమ్మాడట. భాషా సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా తాను విలన్ కావాలని ట్రై చేసాడట.
రఘువరన్ విలనిజం చూసి తాను అలాగే అవ్వాలని అనుకున్నా అని తెలిపాడు. తన లాగే సన్నగా ఉంటాడని రజినీకాంత్ లాంటి పెద్ద స్టార్ హీరోకి ఇలాంటి ఒక బక్క పలుచగా వ్యక్తి విలన్ గా పని చేశాడు అంటే అతడి స్థాయి ఎలాంటిదో మనం అర్ధం చేసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. అనుకోకుండా హీరో అవ్వాల్సి వచ్చిందని… ఇప్పుడు హీరోగా పెద్దగా అవకాశాలు లేకపోయినా కామెడీ హీరోగా బాగానే సక్సెస్ అయ్యానని పేర్కొన్నాడు.