పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఆయనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, ఆడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తన సహచర క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్‌తో బాబర్ ఆజమ్ అశ్లీల చాటింగ్ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
‘నువ్వు నాతో ఇలాగే అశ్లీల చాటింగ్ చేస్తుంటే నీ బాయ్ ఫ్రెండ్ జట్టులో కొనసాగుతాడు’ అని బాబర్ ఆమెతో అన్నట్టుగా వీడియోల్లో కనిపిస్తోంది. ఈ వీడియో సంచలనంగా మారడంతో బాబర్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలోనూ ఆజమ్ పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసింది.
బాబర్ తనను పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ గతంలో హమీజా ముఖ్తర్ అనే యువతి ఆరోపణలు చేసింది. క్రికెట్లోకి రాకముందు నుంచే బాబర్ తనకు తెలుసని ఆమె చెప్పింది. తనకు 2010లో ఆజమ్ ప్రపోజ్ చేశాడని పేర్కొంది.
తాము ఇద్దరం ప్రేమించుకున్నామని వెల్లడించింది. ఆ విషయం తమ పెద్దలకు కూడా తెలిసినట్టు తెలిపింది. కానీ ఆజమ్ కుటుంబ సభ్యులు తమ ప్రేమకు ఒప్పుకోలేదని వివరించింది. దీంతో కోర్టు ద్వారా పెళ్లి చేసుకోవాలనుకున్నామని, కానీ ఆ తర్వాత బాబర్ తనను మోసం చేసినట్లుగా చెప్పుకొచ్చింది.
ఈ వీడియోలపై పాక్ క్రికెట్ అభిమానలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది బాబర్ కాదని కొందరు అంటుంటే.. అతన్ని కావాలనే కొందరు హనీ ట్రాప్ చేశారంటూ మరికొందరు చెబుతున్నారు. ఒక వేళ ఆ వీడియోలు ఆయనవే అయినా అతని కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని ఇంకొందరు అంటున్నారు.
గత కొంత కాలంగా బాబర్ ఆజమ్ కెప్టెన్‌గా ఫెయిల్ అవుతున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లతో జరిగిన సిరీసుల్లో పాక్ దారుణంగా ఓటమి పాలైంది. దీంతో ఆజమ్ కెప్టెన్సీపై పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తిగా ఉంది. ఇటు నాలుగు టెస్టుల్లోనూ వరుసగా ఓడింది.
ఈ క్రమంలో పీసీబీ అధ్యక్షున్ని మార్చారు. ఇక మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్లెన్లను నియమించాలని పీసీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బాబర్ ఆజమ్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ హనీట్రాప్ ఆరోపణలు నేపథ్యంలో బాబర్‌పై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.