ఓ రైతు కుటుంబం పిల్లలతో సహా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. భర్తను కోల్పోయి ముగ్గురు పిల్లలతో బతుకున్న తల్లి తనతో పాటు ఆ ముగ్గురు పిల్లలకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేసింది.
ఇక డీటైల్స్ లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శిఖర్ గన్ పల్లి గ్రామానికి చెందినది ఈ రైతు కుటుంబం. వెంకటమ్మ తన భర్త నుండి వచ్చిన వారసత్వ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ..కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే తన భర్త చనిపోయినప్పటి నుంచి ఆ భూమి పై అదే గ్రామానికి చెందిన వారి బంధువు నర్సింహ స్వామి కన్ను పడింది.
దీంతో ఆమెకు ముందు వెనుక ఎవరూ లేరని గ్రహించిన అతడు వెంకటమ్మ దగ్గర్నుంచి బలవంతంగా భూమిని లాక్కున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని ఊరి పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె..న్యాయం కోసం గత ఐదేళ్లుగా స్థానిక జడ్చర్ల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. అయినా ఆమెకు న్యాయం జరగ లేదు. అయితే స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అనుచరులుగా చలామణి అవుతున్న కబ్జాదారులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని బాధితురాలు వెంకటమ్మ ఆరోపిస్తోంది.
తమ భూమి కోసం పోరాడుతున్న తమ కుటుంబంపై వారు పలుమార్లు దాడి చేయడమే కాకుండా కాళ్ళు కట్టేసి విచక్షణా రహితంగా కొట్టారని కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. తమ భూమిని ఆక్రమించుకున్న కబ్జాదారుల నుండి రక్షణ కల్పించి… వారికి కొమ్ముకాస్తున్న జడ్చర్ల పోలీసులపై చట్టమరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీ ని కోరారు. లేని పక్షంలో తనతో సహా తన ముగ్గురు పిల్లలకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.లేని పక్షంలో తనతో సహా తన ముగ్గురు పిల్లలకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.