సాయి ధరమ్ తేజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు నిర్మాత అల్లు అరవింద్. మీడియాలో రకరకాల వార్తలు రాకుండా ఉండేందుకు మెగా ఫ్యామిలీ తరఫున ఆయన మాట్లాడారు. తేజ్ కొన్ని గంటల్లోనే కోలుకుంటాడని.. జనరల్ రూమ్ కు కూడా షిఫ్ట్ చేస్తామని డాక్టర్లు చెప్పినట్లుగా వివరించారు అరవింద్.
కాసేపట్లో డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని చెప్పిన అరవింద్… తలకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. అలాగే వెన్నెముక కూడా దెబ్బతినలేదని తెలిపారు.