మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. వీరిద్దరి కలయిక తోడవ్వడంతో పాటు సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటూ ఓవర్సీస్‌లో కూడా దుమ్మురేపుతోంది. అమెరికా, న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌తో రికార్డులను తిరగరాస్తోంది.
అమెరికా, న్యూజిల్యాండ్ లో ప్రీమియర్ షోలకు సూపర్బ్ అని టాక్ రావడంతో కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి. అయితే న్యూజిలాండ్ లో మాత్రం ఊహలను తలకిందులు చేస్తూ కలెక్షన్స్ ను రాబడుతోంది ఈ సినిమా. అక్కడ మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసి ఔరా అనిపిస్తోంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ‘బాహుబలి’ ప్రీమియర్ షోలకు న్యూజిల్యాండ్‌లో 21,290 డాలర్లు మాత్రమే రాబట్టాయి.
మరీ ఓవర్సీర్ ఓవరాల్ బిజినెస్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఇంకాస్త ఆగాల్సిందే.