స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయానికి ప్రధాన కారణం ఈ సినిమా పాటలు అనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
రీసెంట్ గా అల వైకుంఠపురములో ట్రైలర్ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. వ్యూస్ పరంగా టాప్ 20లో చోటు దక్కించుకుంది. జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టు డై ట్రైలర్‌ను ఈ సినిమా ట్రైలర్ వ్యూస్ క్రాస్ చేశాయి. ఇలా బన్నీ సినిమా ట్రైలర్ టాప్ 20లో చోటు దక్కించుకోవడంపై అటు అభిమానులు సినీ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మీక నటిస్తుంది.