ఏడాది ఆరంభంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన సినిమా అలవైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించటంతో పాటు మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ఇక మ్యూజికల్ పరంగా కూడా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ అయితే రికార్డుల మీద రికార్డు లు క్రీయేట్ చేస్తుంది. టిక్ టాక్, యూట్యూబ్ లో ఈ సాంగ్ కు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
తాజాగా ఈ సాంగ్ 300 మిలియన్ ప్లస్ వ్యూస్ రాబట్టినట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపారు.ఇప్పటివరకు తెలుగు సాంగ్ ఇంత రికార్డు క్రీయేట్ చేసింది లేదు.
#300millionforbuttabomma
FASTEST FOR ANY TELUGU SONG #fastest300millionsong 🔊🤍♥️💚💜❤️💕💛 #sensationalbuttabomma 📽 pic.twitter.com/qTgfzjPFR1— thaman S (@MusicThaman) August 1, 2020