ప్రముఖ హీరో అల్లు అర్జున్ కార్వాన్ ప్రమాదానికి గురైంది. పుష్ప సినిమా షూటింగ్ స్పాట్ కోసం హైదరాబాద్ నుండి మారేడుమిల్లి అడువుల షూటింగ్ స్పాట్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా సరిహద్దులో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది.
కనిగిరి బ్రిడ్జి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కార్వాన్ ను వెనుక నుండి ఓ భారీ కంటైనర్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అందులో ఎవరూ లేరని తెలుస్తోంది. దీంతో పెను ప్రమాదం తప్పందింది. తూ.గో జిల్లా మారేడుమిల్లి అడవుల్లో పుష్ప సినిమా షూటింగ్ జరుగుతోంది.
భారీ బడ్జెట్ తో షూటింగ్ లో విరామ సమయంలో సేద తీరిందేకు ఈ వాహనాన్ని అల్లు అర్జున్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు.