ఈ ఏడాది అల్లు అర్జున్ మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన పుష్ప చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అర్జున్ పేరు మారుమోగిపోయింది.దాంతో అల్లు కుటుంబం కూడా సంతోషాల్లో మునిగి తేలుతోంది. అందుకుగానూ వారంతా డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ చిత్రాలను అల్లు అర్జున్ స్వయంగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి అభిమానులను మరింత ఉత్సాహ పరిచాడు.
వాటితో పాటు మీ అందరి ఆనందమే మా ఆనందం అంటూ రాసుకొచ్చాడు. వాటిని చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ ఫోటోల్లో అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ, తల్లిదండ్రులు అల్లు అరవింద్ తో పాటు ఆయన సోదరులు వెంకట్, శిరీష్ వారితో పాటు పిల్లలు అందరూ ఉన్నారు. ఎంతో సరదాగా ఉన్న చిత్రాన్ని ఆయన పోస్ట్ చేశారు.
పుష్ప చిత్రానికి గానూ సైమా అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డును కూడా అర్జును గెలుచుకున్నాడు.
అర్జున్ అద్భుతమైన నటనకు, భారతీయ సినిమాకి చేసిన సేవలకు గాను CNN ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. , ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఈ సంవత్సరం ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు.
అల్లు అర్జున్ తాత, ప్రముఖ సినీ నిర్మాత అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ ఎట్టకేలకు తమ కలల ప్రాజెక్ట్ అల్లు స్టూడియోను కొద్ది రోజుల క్రితమే ప్రారంభించింది. అదే రోజున అల్లు రామలింగయ్యపై పుస్తకాన్ని కూడా కుటుంబ సభ్యులు విడుదల చేశారు.