కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా ప్రభలుతున్న నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు వారికి తోచిన సహాయంతో ముందుకు వస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా పనులు లేక ఎంతో మంది రోడ్డున పడ్డారు. వారికిసహాయం గా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్, సాయిధరమ్ తేజ్ లు విరాళం ఇచ్చారు. ఇప్పుడే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ఏపీ, తెలంగాణ, కేరళ ప్రభుత్వాలకు విరాళం ప్రకటించాడు. మొత్తం కోటి ఇరవై అయిదు లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించి, ప్రజలంతా ఇంటికే పరిమితం అయి ప్రభుత్వాలకు సహకరించాలని కోరాడు.
అల్లు అర్జున్ సినిమాలకు ఏపీ, తెలంగాణతో పాటు కేరళలోనూ మంచి మార్కెట్ ఉంది.