పుష్ప సినిమాతో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ కొరటాల శివతో సినిమా ఉంటుందని… అక్టోబర్ తర్వాత సినిమా పట్టాలెక్కుతుందని ప్రకటించారు. అయితే… అనుకోకుండా ఇప్పుడు పాత సినిమాకు తెరపైకి తెస్తున్నాడు బన్నీ.
గతంలో డైరెక్టర్ శ్రీరాం వేణు చెప్పిన కథకు బన్నీ ఇంప్రెస్ అయ్యాడు. కేవలం సింగిల్ సిట్టింగ్ లో బన్నీని సినిమాకు సై అనిపించాడు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు.
కానీ తాజాగా… ఆ సినిమాను ముందుకు తెస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. అతి త్వరలోనే టైటిల్ పోస్టర్ తో పాటు సినిమా స్టార్ట్ అవుతున్నట్లు ప్రకటించనున్నారు. శ్రీరాం వేణు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేస్తుండగా, ఏప్రిల్ 9న మూవీ రిలీజ్ కానుంది.