ఇంకొన్ని గంటల్లో నిహారిక పెళ్లి జరగబోతుంది. ఉదయపూర్ లోని ఉదయ విలాస్ లో నిహారిక చైతన్య ఏడడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా కుటుంబ సభ్యులు అక్కడకు పయనమయ్యారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తల్లిదండ్రులు భార్య పిల్లలతో ప్రత్యేక విమానంలో ఉదయపూర్ కి బయలుదేరారు. కాగా విమానంలో తీసుకున్న కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఒక్కో ఫోటోను పోస్ట్ చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్ ని రాసుకొచ్చారు.
ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో విమాన ప్రయాణం. నిహారిక చైతన్య పెళ్లి సంబరాలు షురూ.. అంటూ కామెంట్ చేశాడు. తన భార్య స్నేహ ఈ ఫోటోని షేర్ చేసి క్యూటీ అంటూ లవ్ సింబల్ ని పోస్ట్ చేశాడు. అలాగే అల్లు దివా అంటూ కూతురి ఫోటోను నాటి అంటూ కొడుకు ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు అల్లు అర్జున్.