తెలుగు సినిమా ప్రపంచంలో అగ్ర హీరోల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు బన్నీ.. చిరంజీవి సినిమాలో ఓ చిన్న పాత్రలో వెండితెరపై కనిపించిన బన్నీ..ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ పుష్ప సినిమాలో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. అయితే తాను మొదటగా కనిపించిన డాడీ సినిమాలో డాన్స్ చేసి అందరిని ఆకట్టున్నాడు. తన డాన్స్ నచ్చి రాఘవేంద్రరావు తనకు రూ.100 రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు బన్నీ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరోగా గంగోత్రి సినిమాలో తనదైన స్టైల్ లో నటించి విజయాన్ని అందుకున్నాడు. అప్పటినుండి ఇప్పటివరకు వెనుదిరిగి చూడకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు బన్నీ.