హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప షూటింగ్ కోసం కాకినాడలో ఉన్నాడు. అయితే వర్షం కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడడంతో అక్కడి ప్రాంతాలను చుట్టేస్తున్నాడు. కాకినాడ పరిసరాల్లో తిరుగుతూ తెగ సందడి చేస్తున్నాడు. గోపీచంద్ నటించిన సీటీమార్ సినిమాను థియేటర్ కు వెళ్లి చూశాడు.
గోకవరంలో రోడ్డు పక్కన పూరిపాకలోని హోటల్ లో టిఫిన్ చేశాడు అల్లు అర్జున్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తిన్నాక డబ్బులు కూడా తానే స్వయంగా ఇవ్వడంపై అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ నెలాఖరుకు పుష్ప మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం.