సుకుమార్ డైరెక్షన్‌లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తెరకెక్కించిన ‘పుష్ప’ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా సిక్వెల్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ న్యూ లుక్‌లో ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చాడు.
దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ఈ న్యూ లుక్ ‘పుష్ప-2’ సినిమా కోసమేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. లాంగ్ హెయిర్ స్టైల్, స్టైలిష్ స్పెట్స్, సింపుల్ కాస్ట్యూమ్స్‌లో మెరిసిన బన్నీ లుక్ అభిమానులను ఎంత గానో ఆకట్టుకుంటుంది.