అల్లు అర్జున్ కు రికార్డులు కొత్త కాదు. కాకపోతే అందరి హీరోల్లా ఆయన కేవలం సినిమా రికార్డులతోనే ఆగిపోడు. సోషల్ మీడియాలో కూడా రికార్డుల వరద పారిస్తుంటాడు బన్నీ. ఇది కూడా అలాంటి రికార్డే.
పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తో తన పాపులారిటీ ని నార్త్ ఇండియాలో కూడా పెంచుకున్నాడు బన్నీ. ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులు పెరిగారు. ఆయన సినిమాల కంటెంట్ ఏదైనా ఆన్‌లైన్‌లో విడుదలైతే చాలు ఇట్టే ట్రెండింగ్ అవుతుంది. అందుకే అభిమానులు అల్లు అర్జున్ ని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటారు.
సోషల్ మీడియాలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు అల్లు అర్జున్. 20 మిలియన్స్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఈ మైలురాయిని సాధించిన తొలి సౌత్ ఇండియా హీరోగా రికార్డ్ సృష్టించాడు బన్నీ.
ఐకాన్ స్టార్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.