స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. మరోవైపు ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లుక్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడ్డ షూటింగ్ మొదలవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా షూటింగ్ ను ప్రారంభించాడు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా మన్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో పుష్ప షూటింగ్ నవంబర్ 10 నుంచి జరుగుతోంది.
పుష్ప షూటింగ్ మొదలైన సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప సినిమా స్టోరీ నాకు బాగా నచ్చింది, ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. నా కెరీర్ లో ఈ తరహా సినిమా చేయడం ఇదే మొదటిసారి.ఓ యూనీవర్స్ అప్పీల్ ఉన్న పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా స్టోరీని అద్భుతంగా రెడీ చేశాడని తెలిపారు. కాగా షూటింగ్ కు సంబంధించి ఓ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.