అలా వైకుంఠపురం లో సినిమా హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించబోతున్నారు.
2022 లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ రాజకీయ నేతగా కనిపిస్తాడని వార్తలు గత కొన్నాళ్లుగా చెక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతకుముందు బన్నీ హీరోగా వచ్చిన రేసుగుర్రం సినిమా పొలిటికల్ బేస్ అయినప్పటికీ రాజకీయ నేతగా మాత్రం కనిపించలేదు. కానీ ఈ సినిమాలో పూర్తిస్థాయిలో రాజకీయ నేతగా బన్నీ కనిపించబోతున్నాడని సమాచారం. స్టూడెంట్ పాలిటిక్స్, పేదరికం నిరక్షరాస్యత వంటి ప్రధాన అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ తో ఆచార్య మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత బన్నీ సినిమా సెట్స్ పైకి రానుంది.