స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కొరటాల దర్శకత్వంలో సినిమాను కూడా ఎనౌన్స్ చేశాడు. అయితే వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమాను అల్లుఅర్జున్ తో ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు. నిజానికి అలవైకుంఠపురములో సినిమా కంటే ముందే ఐకాన్ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో సినిమా ఆగిపోయింది. అయితే ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ గురించి దిల్ రాజ్ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. త్వరలోనే ప్రారంభం కాబోతోందని ప్రకటించింది.
అయితే అల్లు అర్జున్ మాత్రం అగ్ర దర్శకులతోనే పనిచేసేందుకు మొగ్గుచూపుతున్నాడు. దీనితో కథపై ఎంతో నమ్మకంతో ఉన్న దిల్ రాజు ఇంకో హీరోని పట్టే పనిలో పడ్డాడట. వేణు శ్రీరామ్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మరో వైపు ఐకాన్ కథని నాని, రాంచరణ్ లకు కూడా వినిపించాలని చూస్తున్నాడట వేణు.