టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు సోదరుడు సురేష్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం పై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అల్లు అర్జున్ బన్నీ వాసు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో బన్నీ వాసు కుటుంబసభ్యులను అల్లు అర్జున్, అతని తమ్ముడు శిరీష్, దర్శకుడు సుకుమార్ ను పరామర్శించారు. ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లో ఈ ముగ్గురు పరామర్శించడానికి వెళ్లారు.
ఇక సినిమాల విషయానికొస్తే బన్నీ వాసు ప్రస్తుతం అఖిల్ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నిర్మిస్తున్నారు.