మహేష్ బాబుకు మల్టీప్లెక్స్ బిజినెస్ ఉంది. ఏషియన్ గ్రూప్ తో కలిసి ఏఎంబీ మాల్ ను స్థాపించాడు సూపర్ స్టార్. ఇదే దిశగా అల్లు అర్జున్ కూడా అడుగులు వేశాడు. ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు చేస్తున్న బన్నీ, ఇప్పుడు మల్టీప్లెక్స్ మార్కెట్లోకి ఎంటరయ్యాడు. ఇతడు కూడా ఏషియన్ తో కలిసి మల్టీప్లెక్సు బిజినెస్ లోకి అడుగుపెట్టాడు.
బన్నీ, ఏషియన్ గ్రూప్ కలిసి ఏఏఏ (ఏషియన్ అల్లు అర్జున్) పేరిట హైదరాబాద్ అమీర్ పేట్ లో భారీ మల్టీప్లెక్సు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పుడా మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తయింది. ఓపెనింగ్ కు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
నిజానికి ఈ స్థానంలో సత్యం థియేటర్ ఉండేది. హైదరాబాద్ కే ఓ మంచి ల్యాండ్ మార్క్ గా ఉండేది. ఆ సత్యం థియేటర్ ను కూల్చేసి, ఆ స్థానంలో ఏఏఏ ను నిర్మించారు.
త్వరలోనే ఓ మంచి రోజు చూసి ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏఎంబీ స్క్రీన్స్ లో మహేష్ కు సంబంధించిన గుర్తులు కనిపిస్తాయి. అతడి సినీ అవార్డులతో పాటు, రికార్డులు లాంటివి కనిపిస్తాయి. మరి ఏఏఏలో కూడా బన్నీ గుర్తులు, రికార్డుల్ని పొందుపరుస్తారేమో చూడాలి.