అల వైకుంఠపురములో సినిమా సూపర్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ నటించబోయే సినిమా గురించి విశేషాలను అధికారికంగా ప్రకటించబోతుంది చిత్ర యూనిట్. బుధవారం బన్నీ బర్త్ డే సందర్భంగా అఫిషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
అల్లు అర్జున్ 20వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు పుష్ప అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మూవీలో బన్నీ పేరు పుష్పక్ నారాయణ్ అని… అందులో నుండే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్ గా రష్మీక మందన్న నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… జగపతి బాబు, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
బుధవారం ఉదయం 9గంటలకు అధికారికంగా చిత్ర విశేషాలను ప్రకటించనున్నారు.