నాన్నకుప్రేమతో, రంగస్థలం.. ఎన్టీఆర్ చరణ్ లు నటించిన ఈ సినిమాలని సుకుమార్ డైరెక్ట్ చేశాడు. సూపర్ హిట్ అయిన ఈ రెండు చిత్రాల్లో ఉన్న కామన్ పాయింట్ స్టార్ హీరోలో కొత్తగా కనిపిస్తూ గడ్డం పెంచడమే. మాస్ హీరో అయిన ఎన్టీఆర్, అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తే… రామ్ చరణ్ రంగస్థలంతో అద్భుతాలే సృష్టించాడు. అయితే రంగస్థలం తర్వాత మరో సినిమాని అనౌన్స్ చేయని సుకుమార్, రీసెంట్ గా అల్లు అర్జున్ తో మూడో మూవీ అనౌన్స్ చేశాడు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా శేషాచలం అడవుల్లో సాగనుంది. అయితే ఎన్టీఆర్ రామ్ చరణ్ లకి కెరీర్ బెస్ట్ లుక్ ఇచ్చిన సుకుమార్, అల్లు అర్జున్ ని కూడా అదే రేంజులో చూపించడానికి రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో బన్నీ, అండర్ కట్ హెయిర్ స్టైల్ లో ఫుల్ బియర్డ్ తో కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటి వరకూ 19 సినిమాలు చేసిన అల్లు అర్జున్ గడ్డం పెంచి మాత్రం నటించలేదు. గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాలో లైట్ బియర్డ్ తో కనిపించిన అల్లు అర్జున్ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించడానికి సిద్దమవుతున్నాడు. మరి సుకుమార్, ఎన్టీఆర్ అండ్ చరణ్ తో చేసిన మ్యాజిక్ ని అల్లు అర్జున్ తో కూడా రిపీట్ చేస్తాడేమో చూడాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.