సంక్రాంతి పందేనికి సిద్ధంగా ఉన్నాడు అల్లుఅర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో లాంగ్ గ్యాప్ తరువాత అల్లుఅర్జున్ అల వైకుంఠపురంలో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా మరో వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. అల వైకుంఠపురంలో సినిమా నుంచి ఇప్పటివరకు నాలుగు సాంగ్స్ వచ్చాయి. ప్రతి సాంగ్ కూడా ఒకదానిని మించి ఒకటి హైలెట్ గా నిలిచాయి. అయితే ఇక ఐదో సాంగ్ ఈ నాలుగు సాంగ్ లను మించి ఉండబోతుందని సమాచారం. శ్రీకాకుళం జిల్లా యాసలో రాబోతున్న ఈ సాంగ్ కు థమన్ మ్యూజిక్ చింపేసాడని సమాచారం.
ఈ సినిమాలో అల్లుఅర్జున్ సరసన పూజాహెగ్డే నటిస్తుంది. మరో వైపు లాంగ్ గ్యాప్ తరువాత సీనియర్ నటి టబు కూడా నటిస్తుంది.